‘మిరపకాయలు అమ్మేవాడిని’: వేణు

మాంచి కిక్‌ ఇచ్చే గేమ్‌ షోతో ఎంతో మంది నటీనటులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. సాయికుమార్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న గేమ్ షో ‘వావ్-3’.

Published : 26 Nov 2020 01:24 IST

హైదరాబాద్‌: మాంచి కిక్‌ ఇచ్చే గేమ్‌ షోతో ఎంతో మంది నటీనటులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. సాయికుమార్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న గేమ్ షో ‘వావ్-3’. తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చంటి,వేణు,మనాలి,సౌమ్య తాజాగా ఈ గేమ్‌ షోలో పాల్గొన్నారు. అంతేకాకుండా వారు తమ పంచులతో ఎంతగానో అలరించనున్నారు. షో లో భాగంగా సాయికుమార్‌ ఎప్పటిలానే తన పంచులతో నవ్వులు పూయించారు.

షోలో భాగంగా చంటి, వేణు తాము ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు. అలాగే ఇండస్ట్రీకి రాకముందు ‘మిరపకాయలు అమ్మేవాడిని’. ఓ రకంగా ఇండస్ట్రీకి రావాలన్న కోరిక పుట్టడానికి కారణం ఈ కూరగాయల మార్కెట్‌ స్ఫూర్తిదాయకం’ అంటూ వేణు తన జీవిత విశేషాలను చెప్పనున్నారు. ఎంతో జోష్‌ఫుల్‌గా సాగుతోన్న ‘వావ్‌-3’ ఎపిసోడ్‌లోని ఓ రౌండ్‌లో ‘మానవ శరీరంలో మరణించే వరకు ఎదుగుదల ఆగని అవయవాలు ఏవి?’, ‘ప్రపంచంలో చేతితో రాసి ప్రచురితమవుతున్న ఏకైక దినపత్రిక ఏది?’ అని సాయికుమార్‌ ప్రశ్నించగా.. దానికి సమాధానం చెప్పలేక సదరు నటీనటులు కంగారు పడ్డారు. అదే విధంగా ‘సీతను అపహరించి రావణుడు లంకలో ఏ వనంలో ఉంచాడు’ అని ఆయన ప్రశ్నించగా.. దానికి ఓ నటి సమాధానం చెప్పలేకపోవటంతో .. సరదాగా పంచులతో నవ్వుల వర్షం కురిపించనున్నారు. మంగళవారం (డిసెంబర్‌ 1) రాత్రి ప్రసారం కానున్న ‘వావ్‌-3’ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమోను చూసేయండి.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని