ఏదైనా చేసి చూపించాలి: యామీ గౌతమ్‌

విక్కీడోనర్‌తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన బ్యూటీ యామీ గౌతమ్‌. గతేడాది ‘ఉరి’, ‘బాలా’   చిత్రాలతో విజయాలనందుకుంది.  ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌’ చిత్రాల్లోనూ నటించి తెలుగులోనూ మెప్పించింది....

Updated : 17 Dec 2020 20:10 IST

ముంబయి: విక్కీడోనర్‌తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన బ్యూటీ యామీ గౌతమ్‌. గతేడాది ‘ఉరి’, ‘బాలా’   చిత్రాలతో విజయాలనందుకుంది.  ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌’ చిత్రాల్లోనూ నటించి తెలుగులోనూ మెప్పించింది. సినిమాల్లో మొదటినుంచి వైవిధ్యాన్ని కనబరుస్తూ వస్తోందీ భామ. పాత్రల ఎంపికపై వేసిన ప్రశ్నకు సమాధానంగా.. ‘‘ఇలాంటి పాత్రల్లోనే నటించాలని నన్ను నేను సంకెళ్లతో బందీ చేసుకోను. సాధ్యమైనంత మేర ఎక్కువగా పనిచేస్తూ, మంచి దర్శకుల చిత్రాల్లో నటించాలనే కోరుకుంటాను. కామెడీ, సోషల్‌ డ్రామా, హారర్‌ ఇలా అన్ని రకాల చిత్రాలు చేయడం ఇష్టం. ముఖ్యంగా హాస్య చిత్రాల్లో నటించాలనుంటుంది. విభిన్నమైన నటిగా నిరూపించుకోవాలన్న కోరిక ఉంది. కానీ మహిళలకు అలాంటి పాత్రలు అరుదుగా దక్కుతాయి’ అని అంటోంది యామి. ‘‘నా కెరీర్‌లో సరైన దారిలోనే వెళ్తున్నానా? లేదా? అని సందిగ్ధంలో పడిన సందర్భాలున్నాయి. ఆ క్లిష్ట సమయంలో కుటుంబం  సహకారంతో గట్టెక్కాను. ఐఏఎస్‌ అధికారి కావాల్సిన సమయంలో సినిమా కోసం ముంబయి వచ్చావ్‌. అలా వచ్చినందుకైనా ఏదైనా చేసి చూపించాలి అని ఎవరో తరచూ చెవిలో చెబుతున్నట్లు అనిపిస్తుంది’’ అని యామీ తెలిపింది. ప్రస్తుతం ఆమె ‘భూత్‌ పోలీస్‌’ చిత్రీకరణలో బీజీగా ఉంది.

ఇవీ చదవండి

చదువు వదులుకుని.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..

కోపంతో భర్తను కారు నుంచి దింపేసిన ప్రియాంక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని