అందుకే యముడు ఇంట్లో వదిలి వెళ్లాడు..!

ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ మరణించారని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ రాసింది. ఆయన ఓ గొప్ప దర్శకుడని, ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిసింది. దీన్ని చూసిన అనురాగ్‌ సరైన సమాధానం ఇచ్చారు. ‘నిన్న యమ ధర్మరాజును చూశా. ఇవాళ ఆయనే స్వయంగా నన్ను ఇంటి దగ్గర దిగబెట్టారు....

Published : 15 Sep 2020 01:04 IST

నేను సినిమాలు తీయకపోతే..: అనురాగ్‌ కశ్యప్‌

ముంబయి: ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ మరణించారని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ రాసింది. ఆయన ఓ గొప్ప దర్శకుడుని, ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిసింది. దీన్ని చూసిన అనురాగ్‌ సరైన సమాధానం ఇచ్చారు. ‘నిన్న యమ ధర్మరాజును చూశా. ఇవాళ ఆయనే స్వయంగా నన్ను ఇంటి దగ్గర దిగబెట్టారు. ఇప్పటి నుంచి, ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలని నాతో యముడు చెప్పారు’ అని కామెంట్‌ చేశారు.

బాలీవుడ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే వ్యక్తి, నటుడు కమల్ ఆర్‌ ఖాన్‌. ఆయన నడుపుతున్న వెబ్‌సైట్‌ అనురాగ్‌ ఇకలేరని వార్త రాసింది. కమల్‌ ఆర్‌ ఖాన్‌ పలు సందర్భాల్లో సినిమా రివ్యూలు చెబుతూ.. ప్రముఖుల్ని విమర్శించారు. సెలబ్రిటీలపై ఆరోపణలు కూడా చేశారు. 

ఈ నేపథ్యంలో అనురాగ్‌ మరో ట్వీట్‌ చేశారు. ‘నువ్వు సినిమాలు తీయకపోతే.. మూర్ఖులు, భక్తులు దాన్ని బహిష్కరించలేరు. అప్పుడు వారి జీవితాలకు అర్థం లేకుండా పోతుంది. అలాంటి వ్యక్తుల పుట్టుకకు ఓ కారణం ఉండాలని యముడు నన్ను వదిలేసి వెళ్లారు’ అని పేర్కొన్నారు.

సినిమా రివ్యూలు చెప్పొద్దని కరణ్‌ జోహార్‌, అనురాగ్‌ కశ్యప్‌ తనతో అన్నారని 2015లో కమల్‌ ఆర్‌ ఖాన్‌ ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యల్లో నిజం లేదని అనురాగ్ అప్పట్లోనే తేల్చి చెప్పారు. అంతేకాదు ‘బాంబే వెల్వేట్‌’ సినిమాకు మంచి రివ్యూ ఇవ్వమని కరణ్‌ జోహార్‌ రూ.25 లక్షలు ఆఫర్‌ చేశారని 2015 ఏప్రిల్‌లో కమల్‌ ఆర్‌ ఖాన్‌ ట్వీట్లు చేశారు. కానీ ఆ ఆఫర్‌ను స్వీకరించలేదని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు