Updated : 18/10/2020 10:17 IST

చచ్చిపోవాలనిపించింది: జెర్సీ నటి

ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

కొచ్చి: బాలనటిగా గుర్తింపు తెచ్చుకుని, సహాయ నటిగా ఎన్నో తమిళ, మలయాళీ, తెలుగు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ సనూష.  ఆమెకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఇటీవల ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఒకానొక సమయంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. కఠిన పరిస్థితుల కారణంగా మానసిక కుంగుబాటుకు, మనస్తాపానికి గురయ్యానని పేర్కొన్నారు. జీవితంలో తిరిగి వెలుగులు ఎలా నింపుకోవాలో తెలియక ఇబ్బందిపడినట్లు తెలిపారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడంతో.. భయపడ్డానని.. అనంతరం ఓ వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకున్నానని తెలిపారు. చికిత్స కారణంగా కొంతమేర తన ఆరోగ్యం మెరుగుపడిందని ఆమె వివరించారు.

కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్స్‌, నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు పెట్టిన కామెంట్లను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘నా మానసిక ఆరోగ్యం గురించి ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పినందుకు పలువురు నెటిజన్లు నాపై నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. మానసిక కుంగుబాటుతో ఇబ్బందిపడేవాళ్లు.. నా వీడియో చూసి కొంతమేర ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే నేను ధైర్యంగా మాట్లాడగలిగాను’ అని ఆమె అన్నారు.

తెలుగులో తెరకెక్కిన ‘బంగారం’ చిత్రంలో హీరోయిన్‌ సోదరి వింధ్య పాత్రలో సనూష నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. అనంతరం ఆమె ‘జీనియస్‌’, ‘రేణిగుంట’ సినిమాల్లో కీలకపాత్ర పోషించారు. మరోవైపు ఇటీవల నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ చిత్రంలో సనూష జర్నలిస్ట్‌ రమ్య పాత్రలో మెరిశారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని