Kapil Sharma: తెరపైకి కమెడీయన్‌ కపిల్‌ శర్మ జీవితం!

కపిల్‌ శర్మ.. పరిచయం అక్కర్లేని పేరు. కామెడీ షోలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కపిల్‌ శర్మ.. దేశం గర్వించదగ్గ కమెడీయన్‌గా ఎదిగాడు. ఆయన జీవితం ఎంతో మంది కళాకారులకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో

Published : 15 Jan 2022 23:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కపిల్‌ శర్మ.. పరిచయం అక్కర్లేని పేరు. కామెడీ షోలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కపిల్‌ శర్మ.. గొప్ప కమెడీయన్‌గా ఎదిగాడు. ఇప్పుడు అతడి జీవితం బయోపిక్‌గా తెరకెక్కబోతుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రోడక్షన్స్‌ నిర్మించనుండగా.. ‘ఫక్రీ’ చిత్ర దర్శకుడు మృగ్‌దీప్ సింగ్‌ లంబా దర్శకత్వం వహించనున్నారు. ఈ బయోపిక్‌కు ‘ఫన్‌కార్‌’ అనే టైటిల్‌ పెట్టనన్నట్లు సమాచారం. త్వరలోనే ఇతర తారగణం.. సాంకేతిక బృందం ఎంపిక పూర్తి చేసి అధికారిక ప్రకటన చేయనున్నారు.

2007లో ‘ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌’ విజేతగా నిలిచిన కపిల్‌ శర్మ.. ఆ తర్వాత ‘కామెడీ సర్కస్‌’ సహా పలు కామెడీ షోల్లో పాల్గొని నవ్వులు పంచాడు. 2013లో తనే వ్యాఖ్యాత వ్యవహరిస్తూ ‘కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌’ టాక్‌ షోను నిర్వహించాడు. ఆ షో విజయవంతం కావడంతో స్టార్‌ కమెడియన్‌గా మారాడు. కొన్ని కారణాల వల్ల షో ఆగిపోయింది. ఆ తర్వాత 2016లో ‘ది కపిల్‌ శర్మ షో’తో మళ్లీ టాక్‌ షోలు ప్రారంభించాడు. హీరోగా పలు సినిమాల్లోనూ నటించాడు. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘కపిల్‌ శర్మ: ఐయామ్‌ నాట్‌ డన్‌ యెట్‌’ అనే కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని