Raj Tarun Lavanya: రాజ్‌ తరుణ్‌- లావణ్య ఇష్యూ.. మరో ఇద్దరిపై కేసు నమోదు

లావణ్య ఫిర్యాదు మేరకు.. రాజ్‌ తరుణ్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది.

Published : 11 Jul 2024 13:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనను ప్రేమించి, మోసం చేశాడంటూ లావణ్య (Lavanya) అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun)పై నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా.. నటి మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ మల్హోత్రాపైనా కేసు నమోదైంది. ఏ1గా రాజ్‌ తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మయాంక్‌లను చేర్చారు.

లావణ్య ఫిర్యాదు మేరకు.. 2008 నుంచి రాజ్‌తరుణ్‌తో ఆమెకు పరిచయం ఉందని, 2010లో ప్రపోజ్ చేసి, 2014లో రాజ్‌తరుణ్‌ పెళ్లి చేసుకున్నట్లుగా ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు. రాజ్‌ తరుణ్‌ను తన కుటుంబం ఆదుకుందన్న లావణ్య.. రూ.70 లక్షలు రాజ్‌కు ఇచ్చిందని తన ఫిర్యాదులో పేర్కొంది. 2016లో తాను గర్భం దాల్చానని.. తర్వాత అతడు అబార్షన్‌ చేయించినట్లుగా ఫిర్యాదులో వెల్లడించింది. నటి మాల్వీ పరిచయం అయ్యాకే రాజ్‌ తన నుంచి దూరమయ్యాడని, ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే.. మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించారని తెలిపింది. లావణ్య ఫిర్యాదు మేరకు సెక్షన్ 420, 493, 506 కింద రాజ్‌ తరుణ్‌తో పాటు మాల్వీ, మయాంక్‌లపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని