Raj Tarun: నటుడు రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు

సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun)పై నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 10 Jul 2024 16:45 IST

హైదరాబాద్‌: సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun)పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఫిర్యాదు మేరకు 420, 506, 493 సెక్షన్ల కింద రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

రాజ్‌తరుణ్‌, తాను 2012 నుంచి రిలేషన్‌లో ఉన్నామని, ఇటీవల మరో సినీనటితో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్‌ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్‌ కొనసాగిస్తున్నట్టు తేలిందని, ఇదే విషయమై అతన్ని నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను బెదిరించారని, సంబంధం లేని కేసులో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. ‘‘రాజ్‌తరుణ్‌తో నాకు పదేళ్ల క్రితమే వివాహ మైంది. ఇద్దరం కలిసే జీవిస్తున్నాం. కొన్నాళ్ల క్రితం నాకు అబార్షన్‌ చేయించాడు. ఇద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లాం’’  అని అందుకు సంబంధించి కొన్ని ఆధారాలను లావణ్య పోలీసులకు చూపించారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని