ఇంతకీ ఇతను ఎవరు: బ్రహ్మాజీ

స్టార్‌ హీరో తారక్‌ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న ఆయన త్వరితగతిన కోలుకుని పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని నందమూరి....

Published : 24 May 2021 21:54 IST

హైదరాబాద్‌: స్టార్‌ హీరో తారక్‌ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న ఆయన త్వరితగతిన కోలుకుని పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని నందమూరి అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్‌ ఆరోగ్య పరిస్థితిని తెలియచేస్తూ వచ్చిన ఓ ట్వీట్‌ సోమవారం ఉదయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్‌ పూర్తిగా కోలుకున్నారని.. ఆయనకు నెగెటివ్‌ వచ్చిందని.. పేర్కొంటూ నటుడు బ్రహ్మాజీ పేరుతో ఉన్న ఓ ప్రొఫైల్‌ నుంచి ట్వీట్‌ బయటకు రావడంతో అందరూ నిజమేనని ఆనందం వ్యక్తం చేశారు.

కాగా, సదరు ట్వీట్‌ గురించి నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ‘ఇంతకీ ఈ ట్వీట్‌ చేసిన బ్రహ్మాజీ ఎవరు?’ అని ప్రశ్నించారు. దాంతో బ్రహ్మాజీ పేరుతో ఉన్న ఫేక్‌ అకౌంట్‌ను ట్విటర్‌ డిలీట్‌ చేసింది. మరోవైపు ఫేక్‌ ట్వీట్‌ అని తెలుసుకున్న నెటిజన్లు.. కొంత ఆగ్రహానికి లోనైనప్పటికీ తారక్‌ త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని