Vajpayee: వాజ్‌పేయీపై బయోపిక్‌.. మొదలయ్యేది ఎప్పుడంటే?

సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా ఇప్పటికే వెండితెరపై అనేక చిత్రాలు సందడి చేశాయి.

Published : 28 Jun 2022 16:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా ఇప్పటికే వెండితెరపై అనేక చిత్రాలు సందడి చేశాయి. ఇప్పుడు మరో మహోన్నత వ్యక్తి జీవిత కథకు దృశ్యరూపం రానుంది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ(Atal Bihari Vajpayee) జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఉల్లేక్‌ ఎన్‌పీ రాసిన ‘ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయీ: పొలిటీషియన్‌ అండ్‌ పారాడాక్స్‌ ‘ ఆధారంగా అటల్‌’ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా చిత్ర గ్లింప్‌ను విడుదల చేశారు. వినోద్‌ భన్సాలీ, సందీప్‌ సింగ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2023 ప్రథమార్ధంలో ‘అటల్‌’ మూవీని పట్టాలెక్కించి క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించాల్సి ఉంది. నిర్మాత సందీప్‌ సింగ్‌ గతంలో ‘అలీగఢ్‌’, ‘సర్బ్‌జిత్‌’, ‘భూమి’, ‘పీఎం నరేంద్రమోదీ’, ‘ఝండ్‌’ చిత్రాలను నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని