Chandini: అందుకే నేనింకా పెళ్లి చేసుకోలేదు: ‘ఏ’ మూవీ హీరోయిన్‌

తానెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదో ‘ఏ’ మూవీ హీరోయిన్‌ చాందిని తెలిపారు. ఏమన్నారంటే?

Published : 22 Jun 2024 13:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఏ’ (A) సినిమాలో హీరోయిన్‌గా నటించి అప్పట్లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నారు చాందిని (Chandini). ఉపేంద్ర (Upendra) హీరోగా 1998లో తెరకెక్కిన ఈ కన్నడ సినిమా.. తెలుగులో డబ్‌ అయి ఇక్కడా హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల తర్వాత ఈ మూవీ రీరిలీజ్‌ అయింది. శుక్రవారం పలు థియేటర్లలో సందడి చేసింది. ఈసందర్భంగా చాందిని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, ఆ సినిమా చిత్రీకరణ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. దీంతోపాటు వ్యక్తిగత విషయాలపైనా స్పందించారు.

‘‘చదువుకునే రోజుల్లోనే నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. ‘ఏ’ చిత్రం నా జీవితాన్ని మార్చేసింది. ఈ మూవీకి ఉపేంద్ర దర్శకత్వం వహించారు. హీరోయిన్‌ పాత్ర రోల్‌కు ఎంతోమంది అమ్మాయిల ఫొటోలు చూసినా ఎవరూ నచ్చలేదు. పాజిటివ్‌, నెగెటివ్‌ ఛాయలున్న క్యారెక్టర్‌ కావడంతో ఆయన ఆర్టిస్ట్‌ విషయంలో రాజీ పడలేదు. తెలిసిన వాళ్ల ద్వారా నా ఫొటోలు ఆయనకు చేరాయి. నేరుగా నన్ను చూడకుండానే ఫొటోలు చూసి హీరోయిన్‌గా ఎంపిక చేశారు’’ అని తెలిపారు.

‘‘పెళ్లిపై నాకు నమ్మకం ఉంది. అదొక అద్భుతమని భావిస్తా. అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. మన చేతుల్లో ఏం ఉండదు. అది భగవంతుడు నిర్ణయించాలి. ప్రేమతో కూడిన అరెంజ్‌ మ్యారేజ్‌లు బాగుంటాయి’’ అన్న అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని