సుశాంత్‌సింగ్‌ మృతిపై సినిమా!

బాలీవుడ్‌ యువ కథానాయకుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత నెల 14న ముంబయిలోని తన నివాసంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాయి. అతడి మృతితో బాలీవుడ్‌ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి

Published : 21 Jul 2020 14:29 IST

పోస్టర్‌ విడుదల చేసిన నిర్మాత

ముంబయి: బాలీవుడ్‌ యువ కథానాయకుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత నెల 14న ముంబయిలోని తన నివాసంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అయితే సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు సుశాంత్‌ మృతిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. దీంతో సుశాంత్‌ది ఆత్మహత్య?.. హత్య? అనే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మృతిపై బాలీవుడ్‌ నిర్మాత విజయ్‌ శేఖర్‌ గుప్తా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌’ పేరుతో రాబోతున్న ఈ సినిమా తొలి పోస్టర్‌ను ఆయన సోమవారం విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ శేఖర్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘ఈ చిత్రానికి సంబంధించిన 50శాతం స్క్రిప్ట్‌ పూర్తయింది. సెప్టెంబర్‌ 16 నుంచి షూటింగ్‌ ప్రారంభిస్తాం. ముంబయి, పంజాబ్‌లో చిత్రీకరణ ఉంటుంది. 50 రోజుల్లో సినిమా షూటింగ్‌ పూర్తి చేస్తాం. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఉన్న బంధుప్రీతి, మూవీ మాఫియాపై అనుమానాలు, అపోహలు నివృత్తి అవుతాయి. ఇందులో కేవలం సుశాంత్‌ గురించే కాదు.. సుశాంత్‌లా సినీ నేపథ్యం లేకుండా వచ్చి.. ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకున్న ఓ పది మంది జీవితాల గురించి చెప్పబోతున్నాం. ఈ చిత్రంలోని పాత్రలు వారి స్ఫూర్తే.  సుశాంత్‌ పాత్రలో ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన సచిన్‌ తివారి నటిస్తున్నాడు. అతను కూడా సినీ నేపథ్యం లేనివాడే’’అని విజయ్‌ శేఖర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని