దావూద్‌ ఇబ్రహీం జీవిత కథతో..

‘సత్య’, ‘కంపెనీ’ వంటి చిత్రాలతో అండర్‌ వరల్డ్‌ మాఫియాని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పుడాయన

Published : 25 Jan 2021 12:50 IST

హైదరాబాద్‌: ‘సత్య’, ‘కంపెనీ’ వంటి చిత్రాలతో అండర్‌ వరల్డ్‌ మాఫియాని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పుడాయన నుంచి రాబోతున్న మరో మాఫియా చిత్రం ‘డి- కంపెనీ’. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. స్పార్క్‌ సాగర్‌ నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ‘‘డీ కంపెనీ’ గ్యాంగ్‌స్టర్‌ చిత్రాలన్నింటికీ తల్లి లాంటిది. ఇది నా కలల ప్రాజెక్టు. ఒక వీధి ముఠాను భయంకరమైన అంతర్జాతీయ సంస్థగా దావూద్‌ ఎలా మార్చాడనేది ఈ చిత్ర కథ’’ అన్నారు. ఈ చిత్రం త్వరలో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని