Raviteja: ఈసారి అలాంటి కథతో

రవితేజ - హరీష్‌శంకర్‌ అనగానే ‘మిరపకాయ్‌’ సినిమా గుర్తొస్తుంది. విజయవంతమైన ఆ కలయికలో మరో సినిమా రూపొందనుంది.

Updated : 05 Apr 2023 07:06 IST

రవితేజ (Ravi Teja) - హరీష్‌శంకర్‌ (Harish Shankar) అనగానే ‘మిరపకాయ్‌’ సినిమా గుర్తొస్తుంది. విజయవంతమైన ఆ కలయికలో మరో సినిమా రూపొందనుంది. రవితేజతో చేయనున్న సినిమా కోసం ఈసారి   పీరియాడిక్‌ డ్రామా కథని సిద్ధం చేస్తున్నట్టు హరీష్‌శంకర్‌ తెలిపారు. ‘రావణాసుర’ విడుదలని పురస్కరించుకుని మంగళవారం ట్విటర్‌లో రవితేజ ముచ్చటించారు.  ఈ సందర్భంగా ‘మిరపకాయ్‌’ కలయికలో మళ్లీ సినిమా ఎప్పుడన్న ప్రశ్నకి  హరీష్‌శంకర్‌ స్పందిస్తూ...  అన్నయ్యతో సినిమా కోసం ఒక  పీరియాడిక్‌ డ్రామా కథపై కసరత్తులు జరుగుతున్నాయని, చరిత్రని పునరావృతం చేస్తున్నామని బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని