రెహమాన్‌.. ‘తుజే సలామ్‌’!

ప్రపంచ సంగీత వేదికపై భారతీయు సంగీత కళాకారునిగా బలమైన ముద్ర వేశారు ఏ.ఆర్‌ రెహమాన్‌. బుధవారం ఆ స్వరమాంత్రికుని పుట్టినరోజు. భారతీయ సినీ సంగీతంలో ఉవ్వెత్తున లేచే కెరటాల వలె ఆయన స్వరాలు ఉండేవి. ఆయన పాట విన్న

Updated : 06 Jan 2021 15:37 IST

  స్వరమాంత్రికుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ సంగీత వేదికపై భారతీయుల ముద్ర వేశారు ఏఆర్‌‌ రెహమాన్‌. బుధవారం ఆ స్వరమాంత్రికుడి పుట్టినరోజు. ఆయన 55వ వసంతంలోకి అడుగపెట్టారు. భారతీయ సినీ సంగీతంలో ఉవ్వెత్తున లేచే కెరటాల వలె ఆయన స్వరాలు ఉంటాయి. ఆయన పాట విన్న ప్రతీసారి మరో కొత్త ప్రపంచం చూస్తున్నామా! అనే భ్రమను కలిగించేవారు. స్లమ్‌డాగ్‌ మిలినీయర్‌ చిత్రంలోని ‘జయ్‌హో’ గీతంతో రెహమాన్‌ అస్కార్‌ను దక్కించుకొన్నారు. ‘మా తుజే సలామ్‌’అంటూ దేశప్రజలతో సలామ్‌ కొట్టించుకున్నారు. ఆయన తొలిచిత్రం ‘రోజా’ నుంచి ఇప్పటి వరకు తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేస్తున్నారు. స్వతహాగా కీ-బోర్డ్‌ ప్లేయర్‌ అయిన రెహమాన్‌ అద్భుతమైన జింగిల్స్‌ను అందించేవారని ఆయనతో కలిసి పనిచేసిన ఎంతో మంది సంగీత దర్శకులు చెబుతుంటారు. గ్రాండ్‌ మ్యూజిక్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రెహమాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ..ఆయన స్వరపర్చిన కొన్ని అణిముత్యాలను చూద్దామా!

ఇవీ చదవండి!

రాఘవేంద్రరావు హీరో.. తనికెళ్ల భరణి డైరక్టర్‌

‘యస్‌ బాస్‌, సారీ బాస్‌’ఇవే నా డైలాగులు




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని