సంపూర్ణేష్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం!

నటుడు సంపూర్ణేష్‌బాబు షూటింగ్‌లో ఒక ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే సంపూర్ణేష్‌బాబు హీరోగా ‘బజారు రౌడీ’అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్రంలోనే కొన్ని ఫైట్‌ సీన్లను తెరకెక్కిస్తున్నారు. ఈ

Updated : 23 Jan 2021 15:19 IST

హైదరాబాద్‌: షూటింగ్‌లో ఓ ప్రమాదం నుంచి నటుడు సంపూర్ణేష్‌బాబు త్రుటిలో తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే సంపూర్ణేష్‌బాబు హీరోగా ‘బజారు రౌడీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్రంలోని కొన్ని ఫైట్‌ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సంపూ బైక్‌తో పాటు గాల్లో ఉన్నట్టు ఒక షాట్‌ను తీస్తున్నారు. అందుకోసం బైక్‌ను తాడుతో కట్టి కిందకు వదిలే క్రమంలో అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా ఆయన కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి చేరుకుని సంపూను పైకి లేపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడినట్టు సమాచారం.

ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తుండగా సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. మహేశ్వరి వద్ది కథానాయికగా ఆడిపాడుతోంది. సాయి కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయనుంది.

ఇవీ చదవండి!

ఉపాసన షేర్‌ చేసిన ‘నాట్యం’ఫస్ట్‌లుక్‌!

స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని