Leaks: ఇకపై ఊరుకోం.. లీక్‌ రాయుళ్లకు చరణ్‌ సినిమా టీమ్‌ వార్నింగ్‌

ఇటీవల కాలంలో టాలీవుడ్‌కి లీకుల బెడద పెను సమస్యగా మారింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో రూపంలో సినిమాకు సంబంధించిన చిత్రాలు, పాటలు బయటికి వస్తున్నాయి. తాజాగా తమన సంగీత దర్శకత్వంలో రాబోతున్న మహేష్ బాబు ‘‘సర్కారు వారి పాట’’ చిత్రంలోని ‘కళావతి’ పూర్తి పాట లీక్‌ అవ్వడం అందరీకి షాక్‌కు గురిచేసింది.

Updated : 16 Feb 2022 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల కాలంలో టాలీవుడ్‌కు లీకుల బెడద పెను సమస్యగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఏదో రూపంలో సినిమాకు సంబంధించిన చిత్రాలు, పాటలు బయటికి వస్తున్నాయి. తాజాగా తమన్‌ సంగీత దర్శకత్వంలో రాబోతున్న మహేష్ బాబు ‘‘సర్కారు వారి పాట’’ చిత్రంలోని ‘కళావతి’ పూర్తి పాట లీక్‌ అవ్వడం షాక్‌కు గురిచేసింది. ఇంతలోనే.. పవన్ కల్యాణ్‌ ‘‘భీమ్లా నాయక్’’ సాంగ్ నుంచి కూడా ఒక చిన్న బిట్ లీక్ అయ్యి నెట్టింట్లో వైరల్‌ అయ్యింది. ఈనేపథ్యంలో.. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకోబోతున్న టాలీవుడ్‌ నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించి ఎలాంటి లీకులు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ ‘‘శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌’ సామాజిక మాధ్యమాల ద్వారా తమ తదుపరి చిత్రానికి సంబంధించి లీక్ రాయుళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది.

‘‘#RC15 #SVC50 చిత్రీకరణ సినిమా అవసరాలకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో జనసందోహం నడుమ షూటింగ్‌ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, చట్టవిరుద్ధంగా తీసిన షూటింగ్ చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలని మేం అభ్యర్థిస్తున్నాం. అనధికారిక కంటెంట్‌ను పోస్ట్ చేసే ఐడీలపై మా యాంటీ పైరసీ టీమ్ చర్య తీసుకుంటుంది. ఈనేపథ్యంలో అందరూ మా బృందానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మీరు కనుక పైరసీ లింక్స్‌ను మా దృష్టికి తీసుకురావాలనుకుంటే.. report@blockxtech.comకు రిపోర్ట్‌ చేయండి’’ అంటూ ట్వీట్‌ చేసింది.

శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌- కియారా.. హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న  పాన్‌ ఇండియా చిత్రం ‘Rc15’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రాజమండ్రిలో జరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, సునీల్‌, జయరామ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని