Dulquer Salmaan: చిన్నారులను సర్‌ప్రైజ్‌ చేసిన దుల్కర్‌ సల్మాన్‌..

తమ అభిమాన కథానాయకుడు కనిపిస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు.

Published : 28 Jul 2022 19:28 IST

హైదరాబాద్‌: తమ అభిమాన కథానాయకుడు కనిపిస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు. అదే చిన్నారులైతే ఎగిరి గంతేస్తారు. ఆనందంతో ఉబ్బి తబ్బిబవుతారు. అలాంటి సంతోషాన్నే కొందరు చిన్నారులకు అందించారు నటుడు దుల్కర్‌ సల్మాన్‌. తన పుట్టినరోజు సందర్భంగా కొందరు చిన్నారులను కలిసి వారితో కొద్దిసేపు గడిపారు. తనకు ఎప్పటి నుంచో వాళ్ల నుంచి లెటర్స్‌ వస్తున్నాయని, అక్కడకు వెళ్లటం ఉత్సాహంగా ఉందని చెప్పారు. దుల్కర్‌ను చూడగానే చిన్నారులందరూ కరచాలనం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన కూడా ఎంతో ఆప్యాయంగా చిన్నారులందరినీ దగ్గరకు తీసుకున్నారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా దుల్కర్‌ గురించి ఓ చిన్నారి చెప్పిన డైలాగ్‌లకు పడి పడి నవ్వారు. ఆద్యంతం హృద్యంగా ఉన్న ఆ వీడియోను మీరూ చూసేయండి. ఇక దుల్కర్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా రామం’ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని