Updated : 23 Jan 2022 07:03 IST

Aa Ammayi Gurinchi Meeku Cheppali:నన్ను నమ్ముకుని సినిమా తీద్దామనుకుంటున్నా!

‘‘ఇన్ని రోజులు నన్ను నేను అమ్ముకుని సినిమాలు తీశాను. మొదటిసారి నన్ను నేను నమ్ముకుని సినిమా తీద్దామనుకుంటున్నా’’ అంటున్నారు సుధీర్‌బాబు. మరి ఆ చిత్రం ఏంటి? తెరపై దాన్నెలా ఆవిష్కరించాడు? తెలియాలంటే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చూడాల్సిందే.సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రమిది. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. శనివారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్‌ ఫిల్మ్‌మేకర్‌గా కనిపించనున్నారు. కృతిశెట్టి నేత్ర వైద్యురాలిగా అలేఖ్య అనే పాత్రలో నటిస్తోంది. ‘‘అరేయ్‌ నేను ఆరు సంవత్సరాల్లో.. ఆరు సూపర్‌ హిట్లు తీశానురా’’ అంటూ సుధీర్‌ చెప్పిన డైలాగ్‌తో టీజర్‌ ఆసక్తికరంగా మొదలైంది. ఈ ప్రచార చిత్రంలో ఆయన స్టైలిష్‌గా కనిపించారు. ఆయన జీవితంలోకి కృతి ప్రవేశించాక ఏం జరిగింది? ఆమెతో మంచి సినిమా తీయాలని అతను చేసిన ప్రయత్నం ఫలించిందా? ఈ చిత్రం తీసే క్రమంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్నది తెరపై చూడాలి. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: పి.జి.విందా.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని