Aadhi pennisetty: అతి కొద్దిమంది సమక్షంలో యంగ్‌ హీరో పెళ్లి వేడుక..

యంగ్‌ హీరో ఆది పినిశెట్టి, కన్నడ హీరోయిన్‌ నిక్కీ గల్రానీలు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. మార్చి 24న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు.

Published : 15 May 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యంగ్‌ హీరో ఆది పినిశెట్టి, కన్నడ హీరోయిన్‌ నిక్కీ గల్రానీలు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. మార్చి 24న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి డేట్‌ను సీక్రెట్‌గా ఉంచిన ఈ జంట వీరి వివాహ వేడుకకు సంబంధించిన విషయాలపై ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. అందులో ‘మా పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, సినిమా పరిశ్రమలోని స్నేహితులకు మాత్రమే ఆహ్వనం అందుతుంది. చాలా కొద్ది మంది సమక్షంలో ఈ వేడుక జరగనుంది. కానీ, మీ అందరి ఆశీర్వాదం లేకుండా ఈ వేడుక పూర్తికాదు. అందుకే ఈ ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నాము’ అని చెప్పారు. ‘గుండెల్లో గోదారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు ఆది పినిశెట్టి. ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ‘సరైనోడు’,‘నిన్నుకోరి’,‘రంగస్థలం’,‘నీవెవరో’ వంటి చిత్రాలతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని ‘ది వారియర్‌’ సినిమాలో ప్రతి కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు,తమిళ భాషల్లో విడుదలకానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని