Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్‌ చూశారా!

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల వివాహ వేడుక టీజర్‌. వీరి పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో చూడండి...

Published : 13 Aug 2022 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటులు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), నిక్కీ గల్రానీ (Nikki Galrani) దంపతులైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మేలో వివాహ బంధంతో ఒక్కటైందీ ప్రేమ జంట. ఇప్పటికే తమ వెడ్డింగ్‌ స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్న వీరిద్దరూ తాజాగా ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘‘మా పెళ్లై మూడు నెలలవుతోంది. కానీ, నిన్ననే అదంతా జరిగినట్టుంది. మేం ఎప్పటికీ మరిచిపోలేని రోజు అది. దానికి సంబంధించిన మరిన్ని వీడియోలు త్వరలోనే మీ ముందుకొస్తాయి’’ అని తెలిపారు. ఈ జోడీ.. పెళ్లికి ముందు, పెళ్లి పీటలపై ఎంత సందడి చేసిందో ఈ టీజర్‌ చూస్తేనే తెలుస్తుంది. ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. తమ పెట్‌ డాగ్స్‌తో ఆది, నిక్కీ ఫొటోలు దిగడం, వధూవరులుగా తయారవటం, డ్యాన్స్‌ చేయటం.. తదితర మధుర ఘట్టాలన్నింటినీ ఈ వీడియోలో చూడొచ్చు. హీరోలు సందీప్‌ కిషన్‌, మంచు మనోజ్‌ తదితరులు వారికి తోడై వేడుకలో మరింత జోష్‌ నింపారు. ఈ పెళ్లికి హాజరైన మరికొందరు తారలు, రాజకీయ నేతల క్లిప్పింగ్స్‌ తదుపరి వీడియోల్లో చూపించే అవకాశం ఉంది.

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి రెండో కుమారుడే ఆది. ‘ఒక విచిత్రం’ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆది తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఓ వైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు విలన్‌ పాత్రలతో మెప్పించారు. ఈ ఏడాది.. ‘గుడ్‌లక్‌ సఖి’, ‘క్లాప్‌’, ‘ది వారియర్‌’ చిత్రాలు, ‘మోడర్న్‌ లవ్‌: హైదరాబాద్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆది, నిక్కీ ‘యాగవరాయనుం నా కాక్క’, ‘మరగద నాణయం’ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని