
Aadhi: వేడుకగా ఆది పినిశెట్టి వివాహం
పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరోల సందడి
చెన్నై: ‘గుండెల్లో గోదారి’, ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువైన నటుడు ఆది పినిశెట్టి వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. కోలీవుడ్ నటి నిక్కీ గల్రానీని ఆయన పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలు వీరి పెళ్లికి వేదికైంది. అతి తక్కువమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరోలు నాని, సందీప్ కిషన్ సందడి చేశారు. హల్దీ, సంగీత్‌లలో వీరు డ్యాన్స్ చేసి అలరించారు. ఈ వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీ, ఇతర రంగాలకు చెందిన వారందరి కోసం ఈ జంట త్వరలోనే వివాహ విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆది-నిక్కీ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. 2015లో విడుదలైన ‘యాగవరైనమ్ నా కక్కా’ (Yagavarayinum Naa Kaakka)లో ఈ జంట కలిసి నటించింది. ఆ సినిమాతో స్నేహితులుగా మారిన వీరిద్దరూ ‘మరగాధ నాణ్యం’తో ప్రేమికులు అయ్యారు. కోలీవుడ్, టాలీవుడ్‌లలో ప్రస్తుతం ఆది సినిమాలు చేస్తున్నారు. రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘ది వారియర్’లో ఆది ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ENG vs IND: ఆ ‘తుపాన్’ మన మీదకొస్తే..
-
General News
Andhra News: అమరావతి సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు
-
Politics News
AP High court: ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి
-
Business News
GST: రాష్ట్రాలకు పరిహారం కొనసాగింపుపై తేలని నిర్ణయం
-
Politics News
Maharashtra: గోవాకు రెబల్ ఎమ్మెల్యేలు.. సుప్రీంలో మొదలైన విచారణ.. ఠాక్రే కేబినెట్ భేటీ
-
Sports News
అప్పట్లో టీమ్ఇండియాపై సూపర్ ఓపెనింగ్ స్పెల్.. ట్రోలింగ్‌కు గురైన పాక్ మాజీ పేసర్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా