Teesmaar khan: ‘చక్రి’గా సునీల్‌

ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పూత్‌ నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘తీస్‌మార్‌ఖాన్‌’. కల్యాణ్‌జీ గోగాన దర్శకత్వం వహిస్తున్నారు. నాగం తిరుపతిరెడ్డి నిర్మాత.

Updated : 15 Aug 2022 16:03 IST

ది సాయికుమార్‌ (Aadi Sai kumar), పాయల్‌ రాజ్‌పూత్‌ (Payal Rajput) నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘తీస్‌మార్‌ఖాన్‌’ (Tees Maar Khan). కల్యాణ్‌జీ గోగాన దర్శకత్వం వహిస్తున్నారు. నాగం తిరుపతిరెడ్డి నిర్మాత. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు సునీల్‌ (Sunil) ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని సినీవర్గాలు ఇటీవలే విడుదల చేశాయి. ఇందులో సునీల్‌ ‘చక్రి’గా నటిస్తున్నారు. పోస్టర్‌లో ఆయన సీరియస్‌ లుక్‌తో ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. పూర్ణ, కబీర్‌ దుల్హన్‌సింగ్‌, ఠాకూర్‌ ఇతర తారాగణం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 19న విడుదలవుతోంది. సాయికార్తీక్‌ స్వరాలందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని