Tees MaarKhan: ఓటీటీలో ఆది ‘తీస్‌మార్‌ఖాన్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా విజన్‌ సినిమాస్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘తీస్‌మార్‌ఖాన్‌’ (Tees Maar Khan). పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయిక.

Updated : 07 Dec 2022 16:16 IST

హైదరాబాద్‌: ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా విజన్‌ సినిమాస్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘తీస్‌మార్‌ఖాన్‌’ (Tees Maar Khan). పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయిక. సునీల్, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి వచ్చింది.

కథేంటంటే: తీస్‌మార్‌ ఖాన్‌(ఆది సాయికుమార్‌) ఓ అనాథ. తనకు ఒక్కపూట అన్నం పెట్టిందని మరో అనాథ అమ్మాయి వసూధ అలియాస్‌ వసు(పూర్ణ)ని అమ్మలా చూసుకుంటాడు. వీరిని ఓ పోలీసు కానిస్టేబుల్‌ దత్తత తీసుకొని పెంచుతాడు. అతడు చనిపోయిన తర్వాత వసు భర్త చక్రి(సునీల్‌), తీస్‌మార్‌ ఖాన్‌ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. చిన్న చిన్న సెటిల్‌మెంట్స్‌ చేస్తూ జిమ్‌ సెంటర్‌ నడుపుకొంటున్న తీస్‌మార్‌ ఖాన్‌ జీవితంలోకి అనుకోకుండా జీజా (అనూప్ సింగ్ ఠాకూర్) ఎంట్రీ ఇస్తాడు. జీజా ఓ గ్యాంగ్‌స్టర్‌. అతడి అరాచకాలను అడ్డుకునేందుకు నేరుగా హోంమంత్రి శ్రీరంగ రాజన్‌(శ్రీకాంత్‌ అయ్యంగార్‌)నే రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో వసు హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు? జీజాకు ఈ హత్యతో ఏదైనా సంబంధం ఉందా? హోంమంత్రి రంగ రాజన్‌కు తీస్‌మార్‌ ఖాన్‌ మధ్య ఉన్న అనుబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని