Vaisshnav Tej: ఆదికేశవుడి ప్రతాపం

పంజా వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలీల కథానాయిక. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 16 May 2023 11:44 IST

పంజా వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలీల కథానాయిక. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌.నాగవంశీ, ఎస్‌.సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఆదికేశవ’ అనే పేరుని ఖరారు చేశారు. సోమవారం టీజర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలోని కథానాయకుడి పాత్రని, కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ సోమవారం చిత్రబృఃదం ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ‘ఆ గుడి జోలికి మాత్రం రాకండయ్యా... శివుడికి కోపం వస్తే ఊరికి మంచిది కాదు’ అంటూ మొదలయ్యే ప్రచార చిత్రంలో వైష్ణవ్‌తేజ్‌ రుద్ర కాళేశ్వర్‌ రెడ్డిగా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. ఆయన గుడిని కూల్చడానికి వెళ్లిన మనుషులపై ఆయన చేసే పోరాటం ప్రచార చిత్రంలో కనిపిస్తుంది. గుడి చుట్టూ సాగే కథతో చిత్రం రూపొందుతోందని స్పష్టమవుతోంది. ఇందులో చిత్ర పాత్రలో శ్రీలీల, వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణాదాస్‌ నటిస్తున్నారు.  యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా జులైలో   రానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు