Liger: ‘లైగర్‌’ రొమాంటిక్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ వచ్చేసింది..!

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన ‘లైగర్‌’ (Liger) నుంచి సరికొత్త పాట విడుదలైంది. ‘ఆఫత్‌’ (Aafat) అంటూ...

Updated : 15 Aug 2022 15:57 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన ‘లైగర్‌’ (Liger) నుంచి మరో పాట విడుదలైంది. ‘ఆఫత్‌’ (Aafat) అంటూ సాగే ఈ పాటలో విజయ్‌ దేవరకొండ-అనన్యపాండేల (Ananya Pandey) కెమిస్ట్రీ యువతను ఆకర్షించేలా ఉంది. ఈ పాట ఫుల్‌ వీడియోని షేర్‌ చేస్తూ.. ‘‘మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’’గా విజయ్‌ అభివర్ణించారు. ‘‘బాబోయ్‌ మామూలు డ్రామాలు కావు. అన్నీ లెక్కలేసుకుని నువ్వు బకరా అని ఫిక్స్‌ అయినక నంబర్‌ ఇస్తయ్‌. ఇక, వాట్సాప్‌లు షురూ ఐతై చూడు.. నిద్రపోనివవ్వు.. పనులు చేసుకోనివవ్వు.. బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే’’ అంటూ రమ్యకృష్ణ (Ramya Krishna) చెప్పే డైలాగ్‌లతో మొదలైన ఈ పాటలో నటీనటులు తమ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు.

ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో ‘లైగర్‌’ సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాలోని పాటలు, సంభాషణల్లో హిందీ ఎక్కువగా వినిపిస్తుంది. ఇక, కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విజయ్‌ ముంబయి మురికివాడకు చెందిన చాయ్‌వాలాగా కనిపించనున్నారు. ఆయనకు తల్లి పాత్రలో రమ్యకృష్ణ మెప్పించనున్నారు. ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌ కీలకపాత్ర పోషించారు. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. కరణ్‌ జోహార్‌, ఛార్మి నిర్మాతలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని