‘ఇష్క్‌’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’

తేజ సజ్జ, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇష్క్‌’(Not a Love Story). ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ యువతను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా.. ఈ చిత్రం నుంచి ‘ఆగలేకపోతున్నా..’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని విడుదల చేశారు.

Updated : 07 Dec 2022 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తేజ సజ్జ, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇష్క్‌’(Not a Love Story). ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ యువతను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా.. ఈ చిత్రం నుంచి ‘ఆగలేకపోతున్నా..’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్నారు. ఆర్‌.బి.చౌదరి సమర్పణలో ఎన్వీప్రసాద్‌, పారస్‌ జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. తాజాగా విడుదలైన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్‌ అందించారు. మహతిస్వర సాగర్‌ బాణీలు సమకూర్చగా.. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఆలస్యమెందుకు.. మీరూ పాటను ఆస్వాదించండి మరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు