Aakasa Veedhullo: సెప్టెంబరులో.. ‘ఆకాశ వీధుల్లో’

గౌతమ్‌ కృష్ణ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. మనోజ్‌ జెడి, డీజె.మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజిత పొన్నాడ కథానాయిక. ఈ సినిమా సెప్టెంబరు 2న విడుదల కానుంది

Updated : 15 Aug 2022 15:54 IST

గౌతమ్‌ కృష్ణ (Gautham Krishna) హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’ (Aakasa Veedhullo). మనోజ్‌ జెడి, డీజె.మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజిత పొన్నాడ కథానాయిక. ఈ సినిమా సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘ఓ సరికొత్త కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: జూడా శాండీ, ఛాయాగ్రహణం: విశ్వనాథ్‌ రెడ్డి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని