Faisal Khan: లాల్‌ సింగ్‌ చడ్డా.. ముందే క్షమాపణలు అడగాల్సింది: ఆమిర్‌ఖాన్‌ సోదరుడు ఫైసల్‌ ఖాన్‌

సుదీర్ఘ విరామం అనంతరం గత ఆగస్టులో భారీ అంచనాలతో విడుదలైన లాల్‌ సింగ్‌ చడ్డా(Laal Singh Chaddha)బాక్సాఫీస్‌ వద్ద నిరాశను మిగిల్చింది. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ఖాన్‌

Published : 21 Sep 2022 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుదీర్ఘ విరామం అనంతరం గత ఆగస్టులో భారీ అంచనాలతో విడుదలైన లాల్‌ సింగ్‌ చడ్డా(Laal Singh Chaddha)బాక్సాఫీస్‌ వద్ద నిరాశను మిగిల్చింది. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ఖాన్‌(Aamir Khan) ఈ చిత్రానికి సహనిర్మాతగానూ వ్యవహరించి తీవ్ర నష్టాలను చవి చూశారు. ఈ చిత్ర పరాజయానికి నెగెటివ్‌ పబ్లిసిటీ, ఫేక్‌ రివ్యూలే కారణమని ఆమీర్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. బాయ్‌కట్‌ లాల్ సింగ్‌ చడ్డా ప్రచారం సినిమాపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమిర్‌ అభిప్రాయపడ్డారు. అయితే లాల్‌ సింగ్‌ చడ్డా అంత గొప్ప సినిమా ఏం కాదని ఆమిర్‌ ఖాన్‌ సోదరుడైన ఫైసల్‌ ఖాన్(‌Faissal Khan) అన్నారు. 

తాజగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...‘నిజానికి లాల్‌ సింగ్‌ చడ్డా అంత అద్భుతమైన సినిమా కాదు. ఎటువంటి వ్యతిరేకత లేకున్నా ఆ సినిమాకు కలెక్షన్లు వచ్చేవి కావు. సినిమా విడుదలయ్యాక నిరసనకారులను క్షమాపణలు అడిగిన ఆమిర్‌, విడుదలకు ముందే అడగాల్సింది. సినిమా కోసం క్షమాపణలు అడగడం సమంజసం కాదు’ అన్నారు. ప్రస్తుతం ఆమిర్‌తో తనకెటువంటి గొడవలు లేవని, ఇద్దరం సఖ్యతతో ఉంటున్నామని ఫైసల్‌ వెల్లడించాడు. మీరు బిగ్‌బాస్‌కి వెళ్తారా? అన్న ప్రశ్నకు స్పందించిన ఫైసల్‌ ‘నేను మునుపటిలా గృహనిర్బంధంలో ఉండాలనుకోవట్లేదు. స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నా. నీటిలా ప్రవహించాలనుకుంటున్నా’  అని సమాధానమిచ్చాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని