Aamir khan: ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ నష్టాన్ని భరించనున్న ఆమిర్‌ఖాన్..! ఎంతో తెలుసా?

‘లాల్‌ సింగ్‌ చడ్డా’(Laal Singh Chaddha) విషయంలో ఇప్పటికే భారీ నష్టాలను చవి చూసిన

Published : 01 Sep 2022 02:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘లాల్‌ సింగ్‌ చడ్డా’(Laal Singh Chaddha) విషయంలో ఇప్పటికే భారీ నష్టాలను చవి చూసిన అగ్రనటుడు ఆమిర్‌ ఖాన్‌(Aamir Khan) ఇప్పుడు మరో నష్టాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. ఈ సినిమా నష్టాన్ని తగ్గించడానికి తన పారితోషికాన్నీ వదులుకోనున్నాడు. ‘లాల్‌ సింగ్ చడ్డా’ మొత్తం బడ్జెట్‌ రూ.180 కోట్లు కాగా ఆమిర్‌, అతడి మాజీ భార్య కిరణ్‌రావ్‌ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా కోసం గత నాలుగేళ్లుగా వేరే ఏ చిత్రాన్నీ  ఆమిర్‌ అంగీకరించలేదు. ‘విక్రమ్‌ వేద’ లాంటి సినిమాలను సైతం వదులుకున్నారు. ఆగస్టు 11న విడుదలైన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమయ్యింది.  ఇప్పుడు ఆ చిత్రం మిగిల్చిన నష్టాలను పూడ్చడానికి ఆమిర్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాకుగానూ ఆమిర్‌ రెమ్యూనరేషన్‌ రూ.50కోట్లు కాగా, ఇప్పుడు ఆ మొత్తం సొమ్ముని వదులుకుని నిర్మాతలకు నష్టాన్ని తగ్గించాలనుకుంటున్నారట. ఈ నిర్ణయంతో ఆమిర్‌కు ఈ చిత్రంపై మొత్తం రూ.వందకోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇప్పటివరకు ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ కనీసం రూ.వందకోట్ల వసూళ్లను అందుకోలేదని బాక్సాఫీస్‌ వర్గాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో ఆమిర్‌ చిత్రమేది రూ.వందకోట్ల మార్కుని అందుకోకుండా లేదు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఇప్పటివరకు రూ.70 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో కరీనాకపూర్‌ కథానాయిక కాగా, ప్రముఖ యువనటుడు నాగచైతన్య కీలకపాత్ర పోషించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు