Aamir Khan: ‘కేబీసీ’లో ఆమిర్‌ ఖాన్‌.. ఎంత గెలుచుకున్నారంటే?

‘కౌన్‌ బనేగా క్రోర్‌పతి’ కార్యక్రమంలో ఆమిర్‌ ఖాన్‌ సందడి. ఎంత గెలుచుకున్నారో తెలుసా...

Updated : 15 Aug 2022 13:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సామాన్యులనీ కోటీశ్వరులుగా మార్చే కార్యక్రమం ‘కౌన్‌ బనేగా క్రోర్‌పతి’ (Kaun Banega Crorepati 14). బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) హోస్ట్‌గా 14వ సీజన్‌ ఇటీవల మొదలైంది. తొలి ఎపిసోడ్‌లో ఆమిర్‌ ఖాన్‌ సందడి చేశారు. తాను హీరోగా నటించిన ‘లాల్‌సింగ్‌ చడ్డా’ విడుదల నేపథ్యంలో ఆమిర్‌ (Aamir Khan) ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ‘హాట్‌సీట్‌’ వేదికగా పలు ప్రశ్నలకు సమాధానమిచ్చి, రూ. 50 లక్షలు గెలుచుకున్నారు. ‘సమయం అయిపోయింది’ అంటూ బజర్‌ మోగడంతో ముందుకెళ్లలేకపోయారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే స్ఫూర్తితో ఈ షో ప్రారంభమైంది. ఈ షోకి ఆమిర్‌తోపాటు మేజర్‌ డీపీ సింగ్‌, కల్నల్‌ మిథాలీ మధుమిత, ప్రముఖ బాక్సర్‌ మేరీకోమ్‌, భారత ఫుట్‌బాల్‌ జట్టు సారథి సునీల్‌ ఛెత్రీ హాజరయ్యారు. ఈ కొత్త సీజన్‌లో ఓ మార్పు చోటుచేసుకుంది. ప్రతి శుక్రవారం ఈ షోలోని ‘హాట్‌సీట్‌’లో కూర్చొనే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పించారు. ఇంతకు ముందు సీజన్లలో కార్యక్రమం ముగింపు దశలోనే ఈ అవకాశం ఉండేది.

ఆమిర్‌ని అమితాబ్‌ అడిగిన కొన్ని ప్రశ్నలివీ..

* ప్రధాని నరేంద్ర మోదీ 2021లో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?

సమాధానం: సబర్మతి ఆశ్రమం (గుజరాత్‌).

* 2022 ఏప్రిల్‌లో ఎలాన్‌ మస్క్‌ ఏ సంస్థను కొనేందుకు ముందుకొచ్చారు?

సమాధానం: ట్విటర్‌.

* 2022లో ఏ రోజున ‘నారీ శక్తి పురస్కారాన్ని’ రాష్ట్రపతి అందించారు?

సమాధానం: మార్చి 8.

* ఒకరి చేతుల మీదుగా మరొకరు ‘భారత రత్న’ అందుకున్న రాష్ట్రపతులు ఎవరు? 

సమాధానం: బాబూ రాజేంద్ర ప్రసాద్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌.

* ఏ విప్లవకారుడి జీవితాధారంగా రూపొందిన సినిమా.. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి ఓ స్ఫూర్తిగా నిలిచింది.

సమాధానం: చే గువేరా.

అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ‘లాల్‌సింగ్‌ చడ్డా’ సినిమాలో టాలీవుడ్‌ నటుడు నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. కరీనా కపూర్‌ కథానాయిక. హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కి రీమేక్‌గా రూపొందిన ‘లాల్‌సింగ్‌..’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు.
Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని