Aamir Khan: తలపొగరున్న బాస్కెట్‌బాల్‌ కోచ్‌

‘లాల్‌సింగ్‌ ఛద్దా’ తర్వాత కొన్నాళ్లు సేద తీరడానికి అమెరికా వెళ్లిపోయారు మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌. తర్వాత ఆయన ఏ ప్రాజెక్టుపై పని చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఓ

Updated : 28 Sep 2022 06:50 IST

‘లాల్‌సింగ్‌ ఛద్దా’ (Laal Singh Chaddha) తర్వాత కొన్నాళ్లు సేద తీరడానికి అమెరికా వెళ్లిపోయారు మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan). తర్వాత ఆయన ఏ ప్రాజెక్టుపై పని చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఓ తాజా కబురు బయటికొచ్చింది. ‘శుభ్‌ మంగళ్‌ సావ్‌ధాన్‌’ దర్శకుడు ఆర్‌.ఎస్‌.ప్రసన్న తెరకెక్కించే చిత్ర షూటింగ్‌లో త్వరలోనే పాల్గొంటున్నట్టు సమాచారం. స్పానిష్‌ చిత్రం ‘క్యాంపియోన్స్‌’ ఆధారంగా ఇది రూపొందుతోంది. ఆమిర్‌కి జోడీగా అనుష్క శర్మ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలోనే ముందస్తు నిర్మాణ పనులు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆరు నెలల పాటు ఏకధాటిగా షూటింగ్‌ ఉంటుంది. ఈ వివరాల్ని మంగళవారం చిత్రవర్గాలు ప్రకటించాయి. సోనీ పిక్చర్స్‌ ఈ సినిమా నిర్మిస్తోంది. శంకర్‌-ఎహ్‌సాన్‌-లాయ్‌ స్వరాలు సమకూర్చుతున్నారు. ఆమిర్‌ ఇందులో బాగా తలపొగరు ఉన్న వ్యక్తిగా, బాస్కెట్‌బాల్‌ కోచ్‌గా కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని