Aamirkhan: కిరణ్‌రావే బెస్ట్‌ గిఫ్ట్‌ ఇచ్చింది: ఆమిర్‌ఖాన్‌

బాలీవుడ్‌ నటుడు, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌రావు పరస్పర అంగీకారంతో గతేడాది వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ...

Published : 15 Mar 2022 01:50 IST

మాజీ సతీమణిపై నటుడి ప్రశంస

ముంబయి: బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌రావు పరస్పర అంగీకారంతో గతేడాది వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా కలుసుంటామని ఇప్పటికే వీరిద్దరూ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తన పుట్టినరోజుని పురస్కరించుకుని సోమవారం ఉదయం ఆమిర్‌ఖాన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. సుమారు రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన.. బర్త్‌డే ప్లాన్స్‌, తన తదుపరి సినిమాలపై స్పందించారు. అంతేకాకుండా కిరణ్‌రావు నుంచి ఈ ఏడాది బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అందిందని అన్నారు.

‘‘పరస్పర అంగీకారంతోనే కిరణ్‌రావు, నేనూ విడిపోయినప్పటికీ స్నేహితులుగా ఉంటున్నాం. అన్ని విషయాల్లో అభిప్రాయాలు పంచుకుంటున్నాం. ఎలాంటి అంశాల్లో నన్ను నేను మార్చుకోవాలి? నాలో ఉన్న మైనస్‌లు ఏంటో నిర్మొహమాటంగా చెప్పమని ఇటీవల నేను కిరణ్‌రావుని కోరాను. దానికి  అంగీకరించి.. సుమారు 13 పాయింట్స్‌ రాసి ఇచ్చింది. వాటిని మార్చుకోమని సూచించింది. ఇదే నా బర్త్‌డేకి అందిన బెస్ట్‌ గిఫ్ట్‌గా భావిస్తున్నా. ఎందుకంటే నాలో ఉన్న లోపాలను తెలుసుకుని వాటిని సరిచేసుకోవడానికి నేను ఎప్పటికీ సిగ్గుపడను’’ అని ఆమిర్‌ వివరించారు. అనంతరం ఆగస్టు 11న ‘లాల్‌సింగ్‌ చద్దా’ని విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆ సినిమా కోసం తాను ఎంతో కష్టపడినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని