Aamir Khan: ఏమీ చేయలేక ఏడ్చేశా..

‘లాల్‌సింగ్‌ ఛద్దా’ తర్వాత బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ సినిమాలకు కొంత విరామం ప్రకటించారు. ఈమధ్యే కూతురు ఇరాఖాన్‌ నిశ్చితార్థ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Updated : 05 Dec 2022 09:18 IST

‘లాల్‌సింగ్‌ ఛద్దా’ తర్వాత బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) సినిమాలకు కొంత విరామం ప్రకటించారు. ఈమధ్యే కూతురు ఇరాఖాన్‌ నిశ్చితార్థ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాజాగా ఆదివారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నప్పుడు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల్ని తలచుకుంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. ‘ఆరోజులు నాకింకా గుర్తున్నాయి. నాన్న తాహిర్‌ హుస్సేన్‌ ‘లాకెట్‌’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. అందులో జితేంద్ర, రేఖ, ఖాదర్‌ఖాన్‌లాంటి మహామహులు తారాగణం. వాళ్లు ఏడాదిలో 30 సినిమాల్లో నటించేవారు. మా నాన్న పెద్ద నిర్మాత కాకపోవడంతో సరిగా డేట్లు ఇచ్చేవారు కాదు. దాంతో షూటింగ్‌ వాయిదాలు పడుతుండేది. అది పూర్తవడానికి దాదాపు ఎనిమిదేళ్లు పట్టింది. ఆ సమయంలో మేం దాదాపు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది’ అంటూ గతం గుర్తు చేసుకున్నారు. ‘అప్పులిచ్చిన వాళ్లు డబ్బులు ఎప్పుడిస్తావని నిలదీసేవాళ్లు. అసలు చేతిలో పైసా ఉంటేగా ఇవ్వడానికి. నటీనటులు నాకు డేట్స్‌ ఇవ్వడం లేదు. సినిమా పూర్తైతేనే చేతికి డబ్బులు వస్తాయి అని బతిలాడేవారు. కానీ అది వారికి అనవసరం కదా. అప్పుడు నేను పదేళ్ల పిల్లాడిని. ఏమీ చేయలేక మథనపడిపోయేవాణ్ని’ అని ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమీర్‌ఖాన్‌ నటిస్తున్న స్పానిష్‌ రీమేక్‌ చిత్రం వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలు కానుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని