Aamir Khan: ప్రస్తుతానికి సినిమాలు చేయాలని లేదు.. ఎందుకంటే: ఆమిర్‌ ఖాన్‌

తన కెరీర్‌ గురించి బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తనకు సినిమాల్లో నటించాలని లేదని చెప్పారు.

Published : 31 May 2023 13:30 IST

ముంబయి: ప్రస్తుతానికి తాను సినిమాల్లో నటించాలనుకోవడం లేదని బాలీవుడ్‌ స్టార్‌హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) వెల్లడించారు. అందుకే, కొంతకాలం నుంచి వర్క్‌ లైఫ్‌కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. ‘క్యారీ ఆన్‌ జట్టా 3’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) తర్వాత నేను ఏ సినిమాలో నటిస్తున్నానో తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే.. తదుపరి ప్రాజెక్ట్‌ విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి కుటుంబంతో సరదాగా సమయాన్ని గడపాలనుకుంటున్నా. ఆ విషయంలో నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఎమోషనల్‌గా సిద్ధమైన తర్వాత తప్పకుండా సినిమా చేస్తాను’’ అని ఆమిర్‌ వివరించారు.

ఇక ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కపిల్‌ శర్మని ఉద్దేశిస్తూ.. ‘‘కపిల్‌ అంటే నాకెంతో ఇష్టం. ఈ మధ్యకాలంలో ఆయన కామెడీ షోని చూస్తున్నా. అది నాకెంతో నచ్చింది. ఆయనకు అభిమానిని అయిపోయా. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం ఎంతో కష్టమైన పని’’ అని చెప్పారు.

గతేడాది విడుదలైన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha)లో ఆమిర్‌ ఖాన్‌ నటించారు. ఆస్కార్ పుర‌స్కారం సొంతం చేసుకున్న ‘ఫారెస్ట్ గంప్‌’కి (Forrest Gump) రీమేక్‌గా ఇది రూపుదిద్దుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా పరాజయాన్ని అందుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు