Aarambham: మరో ఓటీటీలోకి ‘ఆరంభం’.. ఎక్కడంటే..?

సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా మూవీ ‘ఆరంభం’ మరో ఓటీటీలోకి వచ్చేసింది.

Published : 06 Jul 2024 14:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 'C/o కంచరపాలెం'లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మోహన్‌ భగత్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). ఇప్పటి వరకు ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో ప్రసారమవుతున్న ఈ చిత్రం ఇప్పడు మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇకపై అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోనూ (Amazon Prime Video) అలరించనుంది. సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల థియేటర్లో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ తదితరలు ఇందులో కీలకపాత్రల్లో కనిపించి మెప్పించారు.

కథేంటంటే: ఓ హత్యకేసులో రెండున్నరేళ్లు జైలు జీవితం గడుపుతాడు మిగిల్‌ అనే వ్యక్తి. ఉరిశిక్ష ఖరారు కాగా జైలు నుంచి పారిపోతాడు. ఫుల్‌ సెక్యూరిటీ ఉండగా అతడెలా తప్పించుకున్నాడో తెలుసుకునేందుకు డిటెక్టివ్‌ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో డిటెక్టివ్‌కి మిగిల్‌కు సంబంధించిన పుస్తకం ఒకటి కనిపిస్తుంది. అందులో ఉన్న డెజావు కాన్సెప్ట్‌ ఏంటి? దాని గురించి మిగిల్‌కు చెప్పిందెవరు? అసలు అతడు మర్డర్‌ చేశాడా? లేదా? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని