క్లైమాక్స్‌ సీన్‌ కోసం ఏకధాటిగా 33 కి.మీ. పరుగు!

సినిమా సినిమాకి వైవిధ్యం చూపించాలి. అప్పుడే కదా అభిమానులకు నచ్చేది. అందుకే కొన్ని సన్నివేశాల్లో రిస్క్‌ చేసేందుకు నటీనటులు ఏమాత్రం వెనుకాడరు కూడా.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోయే సల్మాన్‌ ఖాన్‌ చిత్రం ‘అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌‌’లో అలాంటి ఓ సన్నివేశం ఉంది.

Published : 25 Nov 2021 01:59 IST

 

ముంబయి: సినిమా సినిమాకి వైవిధ్యం చూపించాలి. అప్పుడే కదా అభిమానులకు నచ్చేది. అందుకే కొన్ని సన్నివేశాల్లో రిస్క్‌ చేసేందుకు నటీనటులు ఏమాత్రం వెనుకాడరు కూడా. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోయే సల్మాన్‌ ఖాన్‌ చిత్రం ‘అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌‌’లో అలాంటి ఓ సన్నివేశం ఉంది. ఇందులో కీలక పాత్ర పోషించిన నటుడు ఆయుష్‌ శర్మ క్లైమాక్స్‌ సీన్‌ కోసం 33 కి.మీ ఏకధాటిగా పరుగెత్తాడట. పుణెలోని వీధుల్లో ఈ సీన్స్‌ షూటింగ్‌ జరిగింది. గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఉండనుంది. ఓ సిక్కు పోలీసు అధికారి పాత్రలో సల్మాన్‌ కనిపించారు.

60 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి..

జీ5లో వచ్చిన మరాఠీ క్రైమ్‌ డ్రామా ‘ముల్షీ’కి కొనసాగింపుగా సల్మాన్‌ఖాన్‌ సొంత బ్యానర్‌ ఎస్‌కేఎఫ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేసేశారు. సల్మాన్‌ కేవలం 30 నుంచి 35 రోజుల మాత్రమే షూటింగ్‌లో పాల్గొనడం మరో విశేషం. గత పదేళ్లలో సల్మాన్‌ సినిమా ఇంత వేగంగా తెరకెక్కడం ఇదే మొదటిసారి. హితేశ్‌ మోదక్‌, రవి బసూర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సల్మాన్‌ఖాన్‌ నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు