ఓటీటీతో ఆ ఒత్తిడి లేదు

థియేటర్‌లో ఓ సినిమా విడుదలవుతుందంటే ప్రారంభ వసూళ్లే కీలకం. వాటి గురించి దర్శకనిర్మాతలు, హీరోలు చాలా ఆత్రుతగా ఉంటారు. అదే ఓటీటీలో సినిమా విడుదలైతే....

Published : 18 May 2021 10:28 IST

ముంబయి: థియేటర్‌లో ఓ సినిమా విడుదలవుతుందంటే ప్రారంభ వసూళ్లే కీలకం. వాటి గురించి దర్శకనిర్మాతలు, హీరోలు చాలా ఆత్రుతగా ఉంటారు. అదే ఓటీటీలో సినిమా విడుదలైతే ఆ ఒత్తిడే ఉండదు అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు అభిషేక్‌ బచ్చన్‌. కరోనా దెబ్బకు గత ఏడాదిగా చాలా సినిమాలకు ఓటీటీ దిక్కైంది. అభిషేక్‌ నటించిన ‘లూడో’, ‘ది బిగ్‌ బుల్‌’ చిత్రాలు ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఓ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో అభిషేక్‌బచ్చన్‌ మాట్లాడుతూ ‘‘సినిమా థియేటర్, ఓటీటీ... దేనిలో విడుదలైనా ఆ ఆత్రుత, కంగారు దాదాపు ఒకేలా ఉంటాయి. థియేటర్‌ అయితే వందశాతం, ఓటీటీ అయితే 98 శాతం కంగారు ఉంటుందంతే. థియేటర్‌లో సినిమా విడుదల అంటే ఉండే ఓపెనింగ్‌ కలెక్షన్లు, వీకెండ్‌ వసూళ్లు...ఇలాంటి బాక్సాఫీస్‌ లెక్కల ఒత్తిడి ఓటీటీలతో లేదు’’అని చెప్పారు అభిషేక్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని