Abhishek Bachchan: నన్ను ట్రోల్‌ చేయండి.. నా కుమార్తె జోలికొస్తే సహించేది లేదు!

తన గారాలపట్టి ఆరాధ్య నడక కాస్త వంకరగా ఉందంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో వచ్చిన కామెంట్‌పై బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.......

Published : 03 Dec 2021 01:32 IST

ట్రోలర్స్‌కు నటుడు అభిషేక్‌ బచ్చన్‌ వార్నింగ్‌

ముంబయి: తన గారాలపట్టి ఆరాధ్య నడక కాస్త వంకరగా ఉందంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో వచ్చిన కామెంట్‌పై బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తదుపరి చిత్రం ‘బాబ్‌ బిశ్వాస్‌’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..‘‘ నేను పబ్లిక్‌ ఫిగర్‌ని. నన్ను ఎంతైనా ట్రోల్‌ చేయండి. ఒప్పుకొంటా.  కానీ నా కూతురిని అనడానికి మీకు హక్కు లేదు. దమ్ముంటే ఆ మాటలను నా ముందు అనండి. ఎవరైనా ఇలా అంటే సహించేదే లేదు’’ అని హెచ్చరించారు. 

కాగా అభిషేక్‌ నటించిన ‘బాబ్‌ విశ్వాస్‌’ ఈనెల 3న జీ5 ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దియా అన్నపూర్ణ ఘోష్‌ దర్శకత్వం వహించారు. 2012లో వచ్చిన కహానీలోని ‘బాబ్‌ బిశ్వాస్‌’ పాత్రకు వచ్చిన ఫేమ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తీశారు. అందులో బయటకు బీమా ఏజెంటుగా కనిపించే కరడుగట్టిన కిరాయి హంతకుడి ‘బాబ్‌ బిశ్వాస్‌’ పాత్రను శాశ్వతా ఛటర్జీ అనే నటుడు పోషించగా ఆ పాత్రలో ఇప్పుడు అభిషేక్‌ నటించారు. చిత్రాంగదా సింగ్‌, పరాన్‌, టీనా దేశాయ్‌ కీలక పాత్రలు పోషించారు  రెడ్‌ చిల్లీస్‌ సంస్థ నిర్మించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని