Abhishek Bachchan: తెలుగు దర్శకుడితో.. అభిషేక్ బచ్చన్ చిత్రం?
హిందీ కథానాయకుల్ని తమ కథలతో కట్టి పడేస్తున్నారు తెలుగు దర్శకులు. కొన్నేళ్లుగా హిందీ తారలు తరచూ తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నారు.
హిందీ కథానాయకుల్ని తమ కథలతో కట్టి పడేస్తున్నారు తెలుగు దర్శకులు. కొన్నేళ్లుగా హిందీ తారలు తరచూ తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. తాజాగా అలాంటి మరో కలయిక కుదిరినట్టు తెలుస్తోంది. హిందీ కథానాయకుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ఇటీవల తెలుగు చిత్రం ‘అరి’ చూసి, రీమేక్‌కి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘పేపర్‌బాయ్’ ఫేమ్ జయశంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. అరిషడ్వర్గాలు, కృష్ణ తత్వం ప్రధానంగా సాగే ఈ సినిమాలో అనసూయ, సాయికుమార్, సుమన్, ఆమని తదితరులు కీలక పాత్రలు పోషించారు. విడుదలకి సన్నద్ధమవుతున్న ఈ సినిమాని, కొన్ని రోజుల కిందటే అభిషేక్ బచ్చన్ చూసి రీమేక్‌కి అంగీకారం తెలిపినట్టు సమాచారం. హిందీలోనూ జయశంకర్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు