‘ధూమ్‌’ గర్వం ఆయన్ను చూస్తే పోయింది: అభిషేక్‌

అమితాబ్‌ వారుసుడిగా అభిషేక్‌ బచ్చన్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే బిగ్‌బీ స్థాయిలో ఫేమ్ రాకపోయినా తనదైన శైలిలో రాణిస్తున్నారు. తాజాగా ‘బిగ్‌ బుల్‌’అనే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన నటుడు అజయ్‌దేవగణ్‌తో కలిసి కపిల్‌శర్మ షోకు

Updated : 30 Aug 2022 16:26 IST

ముంబయి:  అమితాబ్‌ వారసుడిగా అభిషేక్‌ బచ్చన్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే బిగ్‌బీ స్థాయిలో ఫేమ్ రాకపోయినా తనదైన శైలిలో రాణిస్తున్నారు. తాజాగా ‘బిగ్‌ బుల్‌’ అనే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన నటుడు అజయ్‌దేవగణ్‌తో కలిసి కపిల్‌శర్మ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిషేక్‌ మాట్లాడుతూ ‘ బిగ్‌బీ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నేను కెరీర్‌ ప్రారంభంలో చేసిన చిత్రాలు అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. కానీ ‘ధూమ్‌’ చిత్రం నాకు  స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. అందరూ నా నటనను బాగా ప్రశంసించారు. ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు తీసుకునేవారు. దాంతో నేను గాల్లో తేలిపోయాను. చిత్రం విజయోత్సవ సంబరాలను మా ఇంటికి సమీపంలోని ఒక హోటల్‌లో జరిపారు. అక్కడినుంచి తిరిగి వస్తున్న సమయంలో నేను చాలా గర్వంగా ఫీలయ్యాను. నేను పెద్ద స్టార్‌ అన్న భావన కలిగింది. అలా ఇంటికి వెళ్లి డోర్‌బెల్‌ కొట్టగానే మా తండ్రి(బిగ్‌బీ) తలుపు తెరిచారు. ఆయన్ను చూడగానే ఒక్కసారే నా గర్వం అంతా మాయమైపోయింది. నా తండ్రి సాధించిన దానిలో నేను ఇసుమంతైనా సాధించలేదని అర్థం అయ్యింది.  నేను చాలా కృషి చేయాల్సి ఉందని అప్పుడు అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అభిషేక్‌ ‘బిగ్‌బుల్‌’ చిత్రంలో స్టాక్‌ మార్కెట్‌ సంచలనం హర్షద్‌ మెహతా పాత్రలో నటిస్తున్నారు. అలాగే ‘బాబ్‌ విశ్వాస్‌’అనే మరో చిత్రం కూడా చేస్తున్నారు.

ఇవీ చదవండి!

సుశాంత్‌ బర్త్‌డే..సోదరి ఉదారత

పెళ్లికి ముందు మా ఇద్దరికి బ్రేకప్‌ అయ్యింది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని