Acharya: ఏం చరణ్‌.. డామినేట్‌ చేద్దామని చూస్తున్నావా? చిరంజీవి సవాల్‌..!

తనయుడు రామ్ చరణ్‌కు చిరంజీవి సవాల్ విసిరారు. ‘ఆచార్య’ చిత్రంలో ‘భలే భలే బంజరా’ పాటలో డ్యాన్స్‌ సెట్‌లో చూసుకుందామంటూ ఛాలెంజ్ చేశారు. ఆ

Updated : 17 Apr 2022 06:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తనయుడు రామ్‌చరణ్‌(Ram charan)కు చిరంజీవి(Chiranjeevi) సవాల్ విసిరారు. ‘ఆచార్య’(Acharya) చిత్రంలో ‘భలే భలే బంజరా’ పాటలో డ్యాన్స్‌ స్టెప్‌లు ఎవరెలా వేస్తారో ఆ సెట్‌లో చూసుకుందామంటూ ఛాలెంజ్ చేశారు. ఆ పాటకు సంబంధించి చిత్రీకరణకు వెళ్లే ముందు దర్శకుడు కొరటాలతో చిరంజీవి, రామ్‌చరణ్ చర్చించారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చే ‘భలే భలే బంజారా’ పాటపై మంతనాలు సాగించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నాటునాటు పాటలో తారక్, చరణ్ ఇద్దరూ అదరగొట్టారని, ఆ అంచనాలను అందుకోవాలంటే కష్టపడక తప్పదని చిరంజీవి తెలిపారు. అయితే తనను చరణ్ డామినేట్ చేసే అవకాశం ఉందన్న చిరు... సెట్‌లో కెమెరా ముందు చూసుకుందామంటూ సవాల్ చేశారు. తండ్రి సవాల్ పై స్పందించిన చరణ్... డామినేట్ చేయనని, ఎక్కడా తగ్గని ప్రతిసవాల్ విసిరారు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి తొలిసారి పూర్తి స్థాయిలో చేసిన ‘భలే భలే బంజారా’ పాట ఈ నెల 18న విడుదల కానుంది. ‘ఆచార్య’ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చగా.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించింది. ఏప్రిల్ 29న ఆచార్యను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని