Acharya: ‘ఆచార్య’ సినిమా విడుదల వాయిదా

అగ్రకథానాయకుడు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా విడుదల వాయిదా పడింది.

Published : 16 Jan 2022 03:33 IST

హైదరాబాద్‌: కరోనా ఉద్ధృతి దృష్ట్యా పెద్ద సినిమాల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్‌ సినిమాలు వాయిదాపడ్డాయి. ఆచార్య కూడా అదే బాటలో వెళ్లింది. అగ్రకథానాయకుడు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా ఉద్ధృతి దృష్ట్యా సినిమాను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ‘ఆచార్య’ విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్‌, చరణ్‌ సరసన పూజా హెగ్డే కనిపిస్తుంది. మణిశర్మ స్వరాలందిస్తున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని