Updated : 13 May 2022 19:18 IST

Acharya: ‘ఆచార్య’ ఓటీటీ రిలీజ్‌ ఫిక్స్‌..: ‘భలే బంజారా’ ఫుల్‌ వీడియో చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన యాక్షన్‌ డ్రామా చిత్రం ‘ఆచార్య’ (Acharya). కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వెండితెరపై సందడి చేస్తుండగానే ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియాలో మే 20 నుంచి స్ట్రీమింగ్‌ అవబోతుంది’ అంటూ టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం సాగింది. ఇప్పుడదే ఖరారైంది. ‘ఆచార్య’ను ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్‌కు (OTT) అందుబాటులో ఉంచుతున్నట్టు అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థ (Amazon Prime Video) సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. మరోవైపు, ఈ సినిమాలోని చిరు (Chiranjeevi)- చరణ్‌ (Ram Charan) కలిసి డ్యాన్స్‌ చేసిన హుషారు గీతం ‘భలే బంజారా’ ఫుల్‌ వీడియో విడుదలైంది. ఇద్దరి డ్యాన్స్‌ కనువిందుగా సాగింది. ధర్మస్థలి అనే ఊరి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పూజాహెగ్డే, సోనూసూద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. మణిశర్మ అందించిన సంగీతం సినిమా విడుదలకు ముందే అన్ని వర్గాల శ్రోతలను అలరించింది.

క‌థేంటంటే: 800 యేళ్ల చ‌రిత్ర ఉన్న టెంపుల్ టౌన్ ధ‌ర్మ‌స్థ‌లి. ధర్మానికి... ఆయుర్వేద వైద్యానికి ప్ర‌సిద్ధి. అక్క‌డ అధ‌ర్మం చోటు చేసుకున్న‌ప్పుడు అమ్మ‌వారే ఏదో రూపంలో వ‌చ్చి ధ‌ర్మాన్ని నిల‌బెడుతుంటుంది. అమ్మవారి పాదాల చెంత ధ‌ర్మ‌మే ప‌ర‌మావధిగా నివ‌సిస్తున్న ఓ చిన్న తండాకి పాద‌ఘ‌ట్టం అని పేరు. ఆ పాద‌ఘ‌ట్టం, దానిప‌క్క‌న ఉన్న సిద్ధ‌వ‌నంపై కొంత‌మంది అక్ర‌మార్కుల క‌న్ను ప‌డుతుంది. టెంపుల్ టౌన్ ధ‌ర్మ‌స్థ‌లిపై కూడా బ‌స‌వ (సోనూసూద్‌) పాగా వేస్తాడు. ఎదురొచ్చిన‌వాళ్లని అంతం చేస్తూ అక్ర‌మాలు కొన‌సాగిస్తుంటాడు. పాద‌ఘ‌ట్టం జ‌నాల్ని, ధ‌ర్మ‌స్థ‌లిని  కాపాడేవారే లేరా అనుకునే స‌మ‌యంలో కామ్రేడ్ ఆచార్య (చిరంజీవి) వ‌స్తాడు. ఇంత‌కీ ఆచార్య ఎవ‌రు?ఆయ‌న్ని ఎవ‌రు పంపించారు? ధ‌ర్మ‌స్థ‌లిలోనే పెరిగిన సిద్ధ (రామ్‌చ‌ర‌ణ్)(Ram charan)కీ, ఆచార్య‌కీ సంబంధ‌మేమైనా ఉందా? అన్నది మిగతా కథ.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోము.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని