Aadi: తొందర పాటు తెచ్చే కష్టాలతో..
‘‘ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే మంచి వినోదాత్మక చిత్రం ‘క్రేజీ ఫెలో’. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని పది మందికి చెప్పుకునేలా ఉంటుంది’’ అన్నారు ఆది సాయికుమార్. ఆయన కథానాయకుడిగా ఫణి కృష్ణ సిరికి తెరకెక్కించిన చిత్రమే ‘క్రేజీ ఫెలో’. కె.కె.రాధామోహన్ నిర్మించారు.
‘‘ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే మంచి వినోదాత్మక చిత్రం ‘క్రేజీ ఫెలో’ (Crazy Fellow). సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని పది మందికి చెప్పుకునేలా ఉంటుంది’’ అన్నారు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar). ఆయన కథానాయకుడిగా ఫణి కృష్ణ సిరికి తెరకెక్కించిన చిత్రమే ‘క్రేజీ ఫెలో’. కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు హీరో ఆది.
‘‘చాలా మంచి ఎంటర్టైనర్ ఇది. దర్శకుడు ఫణి చక్కటి కథ రాసుకున్నాడు. దాన్ని అంతే చక్కగా తెరకెక్కించారు. ఇందులో వినోదం కథలో భాగంగానే ఉంటుంది తప్ప ఎక్కడా ఇరికించినట్లు ఉండదు. తప్పకుండా అందరూ మెచ్చే కథ అవుతుంది. చాలా మంది నన్ను ‘లవ్లీ’, ‘ప్రేమ కావాలి’ లాంటి సినిమాలు చేయమని అడుగుతుంటారు. అలాంటి తరహాలో ఉండే చిత్రమే ఈ ‘క్రేజీ ఫెలో’’.
క్రేజీ పాత్రలో..
‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా క్రేజీగా ఉంటుంది. తొందరపాటు ఎక్కువ. చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే పాత్రగా కనిపిస్తుంది. ఈ క్రమంలో చక్కటి వినోదాన్ని పంచిస్తుంది. ఈ పాత్ర కోసం నేను బరువు కూడా తగ్గాను. ఈ సినిమాలో నర్రా శ్రీనివాస్, అనీష్ కురువిల్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రతి పాత్రలోనూ ఓ కొత్తదనం ఉంటుంది’’.
రియలిస్టిక్ కథలో నటించాలి..
‘‘కథల విషయంలో నాన్న జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది. నా కథలు కొన్ని నాన్నే వింటారు. కొన్ని నేను విని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాను (నవ్వుతూ). అందుకే ముందు చక్కగా కథ వినమని చెబుతుంటారు. ఇకపై చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్‌లు ఎంచుకొని చేయాలి. నాకు ఎంటర్టైనర్లంటే చాలా ఇష్టం. అలాగే ఓ రియలిస్టిక్ కథలో నటించాలనుంది’’.
* ‘‘ప్రస్తుతం నేను ‘టాప్‌గేర్’ అనే సినిమా చేస్తున్నా. ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలోనూ నటిస్తున్నా. కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. అలాగే ‘పులి మేక’ అనే వెబ్‌సిరీస్ కూడా చేస్తున్నా’’.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్