Ali: పెట్టె పట్టుకుని రెండు కి.మీ. నడిచా!
బాల నటుడి, హాస్యనటుడిగా, కథానాయకుడిగా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు అలీ. కథానాయకుడి సినిమాలు చేసిన తర్వాత కూడా మళ్లీ
ఇంటర్నెట్‌డెస్క్: బాల నటుడి, హాస్యనటుడిగా, కథానాయకుడిగా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు అలీ. కథానాయకుడి సినిమాలు చేసిన తర్వాత కూడా మళ్లీ కమెడియన్‌గా సక్సెస్ సాధించిన అతి తక్కువ మందిలో అలీ ఒకరు. ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే అలీ మద్రాసులో ఉన్న సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆయనకు మంచి పేరు తెచ్చిన చిత్రమంటే ‘ప్రేమఖైదీ’ అనే చెప్పాలి. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను ఇటీవల పంచుకున్నారిలా..!
‘‘మద్రాసుతో పోలిస్తే హైదరాబాద్‌లో పడిన కష్టాలు నా దృష్టిలో అసలు కష్టాలే కావు. మద్రాసులో స్ట్రగుల్ అయితేనే స్టార్ అవుతాడని చెప్పుకొనేవాళ్లు అప్పట్లో. అక్కడ ఆర్నెళ్లపాటు టీ, బన్నుతోనే గడిపాను. డబ్బుల్లేకపోతే ఎవరినీ అడిగేవాణ్ని కాదు. వీడు డబ్బులు అడగడం మొదలుపెట్టాడ్రోయ్ అంటారని. ఇంట్లో అడిగితే ఇచ్చేవాళ్లే. కానీ అది నాకు ఇష్టం ఉండేది కాదు. కమెడియన్‌గా నాకు మంచి గుర్తింపు వచ్చిందంటే ‘ప్రేమఖైదీ’తోనే. ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అయితే ఆ చిత్రంతో చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.’’
‘‘అప్పటికి నేను మద్రాసులోనే ఉన్నా. ‘ప్రేమఖైదీ’ కోసం నేను ఎంపికయ్యా. ఇంకో రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ బయల్దేరాల్సి ఉంటుందని చెప్పేవాళ్లు, మళ్లీ క్యాన్సిల్ అనేవాళ్లు. దాంతో ఒక రోజు నేనొక సినిమాకి వెళ్లా. అప్పుడే మా రూమ్‌కి మనిషి వచ్చి, అర్జెంటుగా హైదరాబాద్ బయల్దేరాలి అని చెప్పారట. నేనేమో లేను. తిరిగొచ్చాక చూస్తే అప్పటికే నేను వెళ్లాల్సిన రైలు వెళ్లిపోయింది. దాంతో నా సొంత డబ్బులతో నేనే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కి టికెట్ బుక్ చేసుకొని బయల్దేరా. తీరా సికింద్రాబాద్ స్టేషన్‌కి ఇంకాసేపట్లో చేరుకొంటామనగా రైలు ఆగిపోయింది. రిజర్వేషన్లకి సంబంధించి ఏదో చెకింగ్ జరుగుతోంది, బండి ముందుకెళ్లదు అన్నారు. ఒకపక్కేమో షూటింగ్‌కి వెళ్లాలి. నేను రాలేదంటే, వేరెవర్నైనా తీసుకొంటారేమో అనే కంగారు. దాంతో చేసేదేం లేక పెట్టె పట్టుకొని రైలు పట్టాలమీదుగా రెండు కిలోమీటర్లుపైగా నడుచుకుంటూ వెళ్లా. రైలు ఆగింది కానీ.. నా ప్రయాణం మాత్రం ఆగలేదన్నమాట. తీరా స్టేషన్ చేరుకొన్నాక ఫిల్మ్‌నగర్ అంటే ఆటోవాళ్లు ఎవరూ రావడం లేదు. అందరూ నై ఆతా అనేవాళ్లే. ఒకడొచ్చి అన్నపూర్ణ స్టూడియో వరకు వస్తానంతే అన్నాడు. సరే పద అని చెప్పి, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర దిగిపోయి... అక్కడ్నుంచి నడుచుకుంటూ ఫిల్మ్‌నగర్ వెళ్లి చిత్రబృందాన్ని కలుసుకొన్నా’’ అంటూ చెప్పుకొచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఇది 140 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం.. : కొత్త పార్లమెంట్లో ప్రధాని మోదీ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
NTR 100th Birth Anniversary: రాజకీయాలు, సినీ జగత్తులో ఎన్టీఆర్ తనదైన ముద్రవేశారు: మోదీ
-
World News
USA: అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై సూత్రప్రాయంగా ఒప్పందం
-
Sports News
Shubman Gill: కోహ్లీ, రోహిత్ జట్లపై సెంచరీలు.. ఇప్పుడు ధోనీ వంతు : గిల్‌పై మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Movies News
keerthy suresh: కీర్తి సురేశ్ పెళ్లిపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన తండ్రి