Brahmaji: అందుకే మేము పిల్లలు వద్దనుకున్నాం: బ్రహ్మాజీ

తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడు, నెగటివ్‌ రోల్స్‌ చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు నటుడు బ్రహ్మాజీ. కెరీర్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్న ఆయన తాజాగ...

Published : 16 Aug 2022 01:50 IST

హైదరాబాద్‌: తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడు, నెగటివ్‌ రోల్స్‌ చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు నటుడు బ్రహ్మాజీ. కెరీర్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘శంకరాభరణం’ సినిమా వల్లే తాను నటుడిగా మారనని చెప్పుకొచ్చారు. అందరిలా తాను సినిమా కష్టాలు పడలేదని.. కెరీర్‌ ఇప్పుడు బాగుందని అన్నారు. 

‘‘నేను తూర్పుగోదావరి జిల్లాలో పుట్టాను. పశ్చిమగోదావరి జిల్లాలో పెరిగా. మా నాన్న తహసీల్దార్‌. అప్పట్లో సీనియర్‌ నటుడు సోమయాజులుగారు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆయన నటించిన ‘శంకరాభరణం’ విడుదలై సూపర్‌హిట్‌ అయ్యింది. దాంతో ఆయనకు భారీగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సినిమాల్లోకి వెళితే ఇంత ఆదరణ లభిస్తుందా..! అని అప్పుడే అనిపించింది. ఎలాగైనా పరిశ్రమలోకి అడుగుపెట్టాలని అనుకున్నా. చదువు పూర్తైన వెంటనే చెన్నై వెళ్లి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నా. ఆ సమయంలోనే కృష్ణవంశీ, రవితేజ, రాజా రవీంద్ర వంటి పలువురితో పరిచయాలు ఏర్పడ్డాయి. వాళ్లందరూ కూడా సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. ‘గులాబి’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘సింధూరం’ వంటి చిత్రాల వల్ల కెరీర్‌ ఆరంభంలో మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత పదేళ్లు పాటు నేను సంతృప్తి చెందే పాత్రలు దొరకలేదు. ఇప్పుడు మళ్లీ మంచి పాత్రలు వస్తున్నాయి. హాస్యనటుడు, సహాయనటుడు, నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్స్‌ చేస్తున్నాను.’’

తన వ్యక్తిగత జీవితంపై స్పందిస్తూ.. ‘‘బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నేను పెళ్లి చేసుకునే సమయానికి ఆమె ఓ వ్యక్తి నుంచి విడాకులు తీసుకున్నారు. చెన్నైలో ఉన్నప్పుడే ఆమెతో నాకు పరిచయం ఏర్పడింది. ఆమెను ఇష్టపడి పెద్దలకు చెప్పి వివాహం చేసుకున్నా. వివాహమయ్యే సమయానికి ఆమెకు ఓ బాబు ఉన్నాడు. బాబు ఉండగా మాకు మళ్లీ పిల్లలు ఎందుకు? అనిపించింది. అందుకే మేము పిల్లలు వద్దనుకున్నాం. ఆ అబ్బాయే ‘పిట్టకథ’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు’’ బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని