Brahmaji: బ్రహ్మాజీకి రూ.4.65 కోట్ల ఆఫర్‌

‘‘కంగ్రాట్స్. మీ మొబైల్ నంబ‌రుపై మీరు అంత న‌గ‌దు గెలుచుకున్నారు, ఇంత ఆఫ‌ర్ పొందారు’’  అని చాలామంది ఫోన్ల‌కి ఎస్‌.ఎం.ఎస్ (మెసేజ్‌) వ‌స్తుంటాయి. ఇలాంటి ఆశ చూపి మ‌న వ్య‌క్తిగ‌త వివ‌రాల్ని తెలుసుకుని ఖాతాలు ఖాళీ చేస్తుంటారు సైబ‌ర్ నేర‌గాళ్లు.

Published : 18 Jun 2021 01:31 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ‘‘కంగ్రాట్స్. మీ మొబైల్ నంబ‌రుపై మీరు అంత న‌గ‌దు గెలుచుకున్నారు, ఇంత ఆఫ‌ర్ పొందారు’’ అని చాలామంది ఫోన్ల‌కి మెసేజ్‌లు వ‌స్తుంటాయి. ఇలాంటి ఆశ చూపి మ‌న వ్య‌క్తిగ‌త వివ‌రాల్ని తెలుసుకుని ఖాతాలు ఖాళీ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు సైబ‌ర్ నేర‌గాళ్లు. తాజాగా న‌టుడు బ్రహ్మాజీకి ఇదే అనుభ‌వం ఎదురైంది.

‘ల్యాండ్ రోవ‌ర్ కంపెనీ త‌ర‌ఫున‌ మీ మొబైల్ నంబ‌రు రూ.4,65,00,000 గెలుచుకుంది. ఈ న‌గ‌దు పొందాలంటే పేరు, చిరునామా త‌దిత‌ర వివరాల్ని జీ మెయిల్‌కి పంపించాలి’ అని బ్రహ్మాజీకి మెసేజ్ వ‌చ్చింది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి ‘స‌ర్! నాకు ఈ నంబ‌రు నుంచి మెసేజ్ వ‌చ్చింది. ద‌య‌చేసి డ‌బ్బుని తీసుకోండి’ అని హైద‌రాబాద్ సిటీ పోలీసు, సైబ‌రాబాద్ పోలీసు శాఖ ట్విట‌ర్ ఖాతాల‌కి జ‌త చేశారు. దీన్ని చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. బ్ర‌హ్మాజీ ఐడియాకి అవాక్క‌వుతున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని