Chiranjeevi: సతీసమేతంగా చిరంజీవి టూర్‌.. ‘గాడ్‌ ఫాదర్’ ఆసక్తికర కబురు

‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల్ని ఇటీవల పలకరించిన చిరంజీవి, తదుపరి సినిమాల చిత్రీకరణ నుంచి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు.

Updated : 03 May 2022 15:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల్ని ఇటీవల పలకరించిన చిరంజీవి, తదుపరి సినిమాల చిత్రీకరణ నుంచి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. కొవిడ్‌ పాండమిక్‌ తర్వాత తొలిసారి ఆయన విదేశీ పర్యటన చేస్తున్నారు. సతీమణి సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌ వెళ్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ ప్రయాణానికి సంబంధించిన ఫొటోని పోస్ట్‌ చేశారు. ‘హ్యాపీ జర్నీ’, ‘ఎంజాయ్‌ ది ట్రిప్‌’ అంటూ నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు కామెంట్లు పెడుతున్నారు.

తమన్‌ సంగీతం.. ప్రభుదేవా నృత్యం

మరోవైపు, చిరు నటిస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ నుంచి సినీ అభిమానులకు ఆసక్తికర కబురు అందింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా నృత్య రీతులు సమకూరుస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కనున్న హుషారైన గీతానికి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారంటూ సంగీత దర్శకుడు నెట్టింట ఫొటోను విడుదల చేశారు. గతంలో చిరు- ప్రభుదేవా కాంబినేషన్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ గీతాలు రావడంతో ఇప్పుడు ‘గాడ్‌ ఫాదర్‌’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మలయాళం సూపర్‌హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ‘గాడ్‌ ఫాదర్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యదేవ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంతోపాటు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, వెంకీ కుడుముల దర్శకత్వం ఓ చిత్రం ఖరారు చేశారు చిరు. నటి రాధికా నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని