Costumes krishna : టాలీవుడ్‌లో విషాదం.. సినీనటుడు కాస్ట్యూమ్స్‌ కృష్ణ కన్నుమూత

నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్‌ కృష్ణ (Costumes Krishna)  కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

Updated : 02 Apr 2023 09:55 IST

చెన్నై: టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.  సీనియర్‌ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్‌ కృష్ణ (Costumes Krishna)  కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా, లక్కవరపు కోటలో జన్మించిన కృష్ణ.. చాలా సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు.

1980ల్లో వచ్చిన అనేక మంది అగ్ర హీరోల సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్‌ అందించారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్‌ బంద్‌’ సినిమాతో కాస్ట్యూమ్స్‌ కృష్ణ నటుడిగా పరిచయమయ్యారు. . ఆ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ విలన్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత విలన్‌, సహాయ పాత్రల్లో నటించారు. పెళ్లి పందిరి సహా 8 చిత్రాలకు నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని