కేబీఆర్‌ పార్క్‌లో మెుక్క నాటిన దుల్కర్ సల్మాన్‌

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ మొక్క నాటారు. నటి అదితి రావు హైదరి విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన దుల్కర్..

Updated : 10 Nov 2021 14:11 IST

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ మొక్క నాటారు. నటి అదితి రావు హైదరి విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన దుల్కర్.. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కులో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని దుల్కర్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సవాల్‌ను స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని